: ఏసీ బాక్సులో పాము.. ఇంట్లోని ఎలుకని తినేసి మళ్లీ అందులోకే వెళ్లిపోయింది.. మీరూ చూడండి!
ఏసీ బాక్సులోంచి వచ్చిన ఒక పాము ఇంట్లోని ఎలుకను నోటితో పట్టుకొని, తినేసి మళ్లీ అందులోకే వెళ్లిపోయిన ఘటన సింగపూర్లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని ఆ ఇంట్లోని వారు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్గా మారింది. ఒక్కసారిగా పామును చూసి షాక్ అయిన ఆ ఇంట్లోని వారు ఇన్నాళ్లూ తాము ఓ పాముతో పాటే ఇంట్లో ఉన్నామా? అని తలచుకుని వణికిపోయారు. పాములు పుట్టల్లోనే కాదు ఏసీల్లో కూడా ఉంటాయంటూ దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి.