: తన గురించి వస్తున్న వార్తలను ఖండించిన విజయశాంతి


తమిళనాడు రాజకీయాల్లోకి వెళతోందనే వార్తలకు ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి ఫుల్ స్టాప్ పెట్టారు. తన రాజకీయ జీవితం తెలంగాణలోనేనని ఆమె స్పష్టం చేశారు. దివంగత జయలలితతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని... ఆమంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమెకు కూడా తానంటే చాలా ఇష్టమని చెప్పారు. ఆమెపై ఉన్న అభిమానంతోనే కష్టకాలంలో అన్నాడీఎంకేకు మద్దతు తెలిపానని వెల్లడించారు. ప్రజలకు ఎంతో సేవ చేసి, పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి జయ మళ్లీ అధికారంలోకి వచ్చారని... అలా వచ్చిన ప్రభుత్వాన్ని కూలదోయడం మంచిది కాదని చెప్పారు. అనారోగ్య కారణాలతోనే తాను కొంత కాలం విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. 

  • Loading...

More Telugu News