: మావైపు కూడా అలానే చూస్తారు... కానిస్టేబుల్ వెకిలి చూపులపై ట్వీట్ చేసిన బాధితురాలితో మహిళా డీసీపీ!


జీడిమెట్ల పోలీస్ కానిస్టేబుల్ తన వక్షోజాలను తదేక దృష్టితో అసభ్యకరంగా చూశాడని ఆరోపిస్తూ, అమీర్ పేట యువతి చేసిన ట్వీట్ వైరల్ కాగా, దీనిపై పోలీసు యంత్రాంగం కదిలింది. ఈ మధ్యాహ్నం ఓ టీవీ చానల్ తో మాట్లాడిన బాధితురాలు, పత్రికల్లో తన ట్వీట్ పై వార్తలు వచ్చిన తరువాత, మహిళా డీసీపీ షర్మిల తనకు ఫోన్ చేశారని తెలిపారు.

కేసు విషయాలు అడుగుతూ, అసలేం జరిగిందో చెప్పాలని కోరారని చెబుతూ, "మార్నింగ్ ఎరౌండ్ 7:30 నుంచి 8 మధ్య ఫోన్ చేశారు. కేసు విషయాలు అడిగారు. చెప్పాను. నేను మొత్తం చెప్పాను. రిపోర్టు చేసే మెకానిజం ఈజీగా ఉండాలి మాకు... ఇలాగైతే సెక్స్యువల్ క్రైమ్స్ రిపోర్టు చేయడానికి వెనుకాడతారు అంటే, ఆవిడ చాలా యాదృచ్చకంగా ఎలా అనేశారంటే... క్యాజువల్ గా 'మా వైపు కూడా ఒక్కోసారి అలాగే చూస్తారు' అన్నారు. ఇక డీసీపీ గారే అలా మాట్లాడారంటే, మామూలు సామాన్య ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? పోలీసులు, వారి పరిస్థితే అలా వుంటే... పోలీస్ ట్రైనింగ్ లోనే ప్రాబ్లమ్ ఉండే ఉంటుంది. అది పోవాలి" అని అన్నారు. ఆ రోజు తాను వేసుకున్న డ్రస్ లో లోపం లేదని, చూసే దృష్టిలోనే లోపం ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News