: భారత్ లో చలామణిలోకి వచ్చిన మరో కొత్త రూ. 500 నోటు!
భారత్ లో ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ. 500 నోట్లకు తోడుగా, మరింత సెక్యూరిటీ ఫీచర్స్ పెంచిన కొత్త నోట్లను విడుదల చేసినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్దిసేపటి క్రితం వెల్లడించింది. కొత్త నోటుపై 'ఏ' అనే అక్షరాన్ని జోడించామని తెలిపింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత దేశంలో విడుదలైన రూ. 500 కొత్త నోట్లు కూడా చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేసింది. నకిలీ కరెన్సీని అడ్డుకునేందుకే అదనపు సెక్యూరిటీ ఫీచర్ ను జోడించినట్టు ఆర్బీఐ తెలియజేసింది. కాగా, ఒక రూపాయి నోటును సైతం తిరిగి ప్రవేశపెట్టాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తున్న సంగతి తెలిసిందే.