: ఎయిర్ షోలో అందరూ చూస్తుండగా బోల్తా పడిన విమానం...వీడియో చూడండి


విమానం బోల్తా పడడమేంటన్న అనుమానం వచ్చిందా? కానీ ఇది నిజం. ఉత్తర ఫ్రాన్స్ ప్రాంతంలో 'లాంగుయాన్‌ విలెట్‌ ఎయిర్‌ షో' నిర్వహించారు. ఇందులో వివిధ రకాల విమానాలు పాలుపంచుకుంటున్నాయి. ఈ ఎయిర్ షోను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చారు. దీంతో ఈ ఎయిర్ షో సందడిగా సాగుతోంది. ఇంతలో ఈ ఎయిర్ షోలో పాల్గొన్న రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఓ యుద్ధ విమానం టేకాఫ్ సమయంలో ఎవరూ ఊహించని విధంగా ముక్కు నేలకు రాసుకుని అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఎయిర్ షో వీక్షణకు వచ్చిన సందర్శకులకు కొద్ది దూరంలో ఈ విమానం బోల్తా పడడంతో సందర్శకులు బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనలో గాయపడిన పైలెట్ ను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను సందర్శకులు తమ ఫోటోల్లో బంధించి, సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News