: పళనిస్వామిని కలసిన కోలీవుడ్ హీరోయిన్!


తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని ప్రముఖ తమిళ హీరోయిన్, నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి కలుసుకున్నారు. పళని నివాసానికి వెళ్లిన ఆమె ముఖ్యమంత్రితో మహిళా సమస్యలపై చర్చించారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆమె 'సేవ్ శక్తి' అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. మహిళలపై దాడులకు వ్యతిరేకంగా ఆమె సంతకాల సేకరణ కూడా చేపట్టారు.

ఈ నేపథ్యంలో పళనిస్వామికి ఆమె ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. వీరిద్దరి సమావేశం పావుగంట సేపు కొనసాగింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, తమ సంస్థ చేపడుతున్న కార్యాక్రమాల గురించి ముఖ్యమంత్రికి వివరించానని తెలిపారు. జిల్లాలలో మహిళా కోర్టుల సంఖ్యను పెంచాలని సీఎంను కోరానని చెప్పారు. తన డిమాండ్లను ముఖ్యమంత్రి ఓపికగా విన్నారని... అన్నింటిని నెరవేరుస్తానని హామీ ఇచ్చారని తెలిపింది.

  • Loading...

More Telugu News