: నలుగురూ చూస్తుండగా ఈ పనేంటన్నందుకు పొడిచేశారు!


నలుగురూ తిరిగే నడివీధిలో ఓ జంట రొమాన్స్ సాగిస్తూ, ముద్దు పెట్టుకుంటూ కనిపించగా, అదేం పనని వారించినందుకు పదునైన వస్తువులతో పొడిచిన ఘటన ముంబైలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, పరేల్ ప్రాంతానికి చెందిన గణేశ్ సహానే రోడ్డుపై వెళుతున్న వేళ, మాంటీ అనే యువకుడు, మరో యువతి బహిరంగంగానే అసభ్య భంగిమలో కనిపించారు.

చుట్టూ నలుగురూ తిరుగుతున్నారన్న ఆలోచన కూడా లేకుండా వీరిద్దరూ ముద్దులు పెట్టుకుంటున్నారు. దీంతో సహానే వారిని వారించగా, వాగ్వాదం చోటు చేసుకుంది. మాంటీ, తన స్నేహితులను పిలిచి, సహానేపై దాడికి దిగాడు. అందుబాటులో ఉన్న గాజు సీసాను పగలగొట్టి పొడిచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గణేశ్ ను ఆసుపత్రికి తరలించారు. దాడికి దిగిన వారిలో ఒకరిని అరెస్ట్ చేశామని, మిగతావారి కోసం వెతుకులాట ప్రారంభించామని తెలిపారు.

  • Loading...

More Telugu News