: కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు నివాసంపై ఏసీబీ దాడులు
హైదరాబాదులోని మియాపూర్ భూ కుంభకోణంలో భాగంగా సస్పెండై జైల్లో ఉన్న కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు నివాసంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. శ్రీనివాసరావుకు సంబంధించిన పది ఆస్తులపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులను గుర్తించి, సీజ్ చేసినట్టు తెలుస్తోంది. 50 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది. కాగా, మియాపూర్ లో వెలుగు చూసిన కుంభకోణం వందల కోట్ల రూపాయల విలువైనది కావడంతో, ఈ స్కాములో చేతులు మారిన డబ్బుపై నిగ్గు తేల్చేందుకు ఏసీబీ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది.