: రికార్డు సృష్టించిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకే రోజు 169 రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రారంభం


తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం కొత్తగా 169 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించింది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజే రికార్డు స్థాయిలో స్కూళ్లు ప్రారంభించిన అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అభినందించారు. రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్టు ఈ సందర్భంగా సీఎం తెలిపారు. మొత్తం 255 స్కూళ్లు ప్రారంభించాల్సి ఉండగా ప్రస్తుతం 169 స్కూళ్లను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ పాఠశాలల్లో చేరే విద్యార్థులు మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్‌లను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కేజీ-టు-పీజీ ఉచిత విద్యను అమలు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వివరించారు.

  • Loading...

More Telugu News