: జాక్ పాట్ అంటే ఇదే ... లాటరీలో 2,888 కోట్లు!
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తికి జాక్ పాట్ తగిలింది. అమెరికాలో ప్రతిష్ఠాత్మక పవర్ బాల్ కంపెనీ నిర్వహించే లాటరీని కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తి గెలుచుకున్నాడని ఆ సంస్థ ప్రకటించింది. అతని భద్రత దృష్ట్యా అతని వివరాలు వెల్లడించడం లేదని లాటరీ నిర్వాహకులు తెలిపారు. అతను ఈ లాటరీలో ఏకంగా 448 మిలియన్ డాలర్లు (2,888 కోట్ల రూపాయలు) గెలుచుకున్నారని తెలిపారు. ఈ మొత్తంలోంచి స్థానిక పన్నులు, ఇతర చార్జీలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని విజేతకు అందజేస్తామని తెలిపారు. అలాగే ఈ లాటరీ టికెట్ ను కాలిఫోర్నియాలోని రివర్ సైడ్ కౌంటీ అనే ప్రాంతంలోని దుకాణం నుంచి విజేత కొనుగోలు చేశారని, అందువల్ల ఈ దుకాణదారులకు సుమారు కోటిన్నర రూపాయలు అందజేయనున్నామని వారు తెలిపారు. అమెరికాతో పాటు మరికొన్ని పాశ్చాత్య దేశాల్లో లాటరీల నిర్వహణ అధికారికం. తాజాగా కేరళలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లాటరీ వ్యాపారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.