: ప్రియుడితో తాను చేసిన ఛాటింగ్ చూశాడని భర్తను కొడవలితో నరికిన భార్య!


విలువలు, మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. గుట్టుమట్టుగా సాగిస్తున్న తన నిర్వాకాన్ని గుర్తించిన భర్తను భార్య నరికి ప్రియుడితో పరారైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ఘటన వివరాల్లోకి వెళ్తే....యూపీలోని ఖేరాఘ‌ర్ లోని భిలావ‌లి గ్రామానికి చెందిన నేత్రాపాల్ కు 2014 లో నీతూ సింగ్ అనే మహిళతో వివాహమైంది. వివాహం జరిగిన కొన్ని రోజులకే తన భార్యకు వేరే అబ్బాయితో సంబంధ‌ముంద‌ని, అత‌డినే ప్రేమిస్తోందని నేత్రాపాల్ కు తెలిసింది. దీంతో వారిద్దరూ విడిపోయి దూరంగా ఉంటున్నారు. ఇంకా విడాకులు మంజూరు కాలేదు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ ఫంక్ష‌న్ లో పాల్గొనేందుకు నీతూ సింగ్ త‌న భ‌ర్త ఇంటికి వ‌చ్చింది. ఈ క్రమంలో వాట్స్ యాప్ లో నీతూ ప్రియుడితో ఛాట్ చేస్తుండగా నేత్రాపాల్ చూశాడు. దీంతో ఆమెను ఫోన్ ఇవ్వాలని కోరాడు. ఆమె ఇవ్వలేదు.

దీంతో ఆమె నుంచి బలవంతంగా ఫోన్ ను లాగేసుకుని, ప్రియుడితో ఆమె సంభాషణ మొత్తం చూసేశాడు. ఫోన్ లాక్కుని ఛాట్ సంభాషణ చూసేయడంతో ఆగ్రహానికి గురైన నీతూ ఇంట్లోని కొడవలితో అతని తలపై బలంగా కొట్టింది. వెంటనే అతను గట్టిగా అరుస్తూ ఇంట్లో కుప్పకూలిపోయాడు. దీంతో బంధువులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ఈ హడావుడిలో నీతూ తప్పించుకుని, ప్రియుడితో కలిసి పారిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో అతనికి చికిత్స చేసి, తలకు కుట్లు వేశారు. దీంతో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆసుపత్రిలో నేత్రాపాల్ ను చేర్చిన బంధువులు నీతూ, ప్రియుడి కోసం గాలింపు చేపట్టారు. ఇద్దర్నీ పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.  

  • Loading...

More Telugu News