: సంజయ్ దత్ ను 8 నెలల ముందే ఎందుకు విడుదల చేశారు?: బాంబే హైకోర్టు ప్రశ్న


1993 ముంబై బాంబు పేలుళ్ల సమయంలో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న నేరంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ కు ఐదేళ్ల జైలు శిక్ష పడగా, సత్ప్రవర్తన కారణంగా అతనిని 8 నెలల ముందే మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై దాఖలైన పిటిషన్ ను విచారించిన బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. శిక్షాకాలం ముగియకముందే పెరోల్ పై సంజయ్ దత్ ను ఎలా విడుదల చేశారని అడిగింది. దీనిపై సమాధానం చెప్పాలని ఎరవాడ జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది. 

  • Loading...

More Telugu News