: ట్రంప్ కు మరోసారి షాక్... ట్రావెల్ బ్యాన్ వివక్షతో కూడుకున్నదే!: న్యాయస్థానం


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే ఎఫ్బీఐ మాజీ చీఫ్ జేమ్స్ కోమే వ్యవహారంతో తల బొప్పికట్టిన ట్రంప్ కు న్యాయస్థానంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆరు ముస్లిం దేశాలపై ట్రంప్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ నిర్ణయం వివక్షతో కూడుకున్నదని, ఇలాంటి వివక్ష సరికాదంటూ హవాయి రాష్ట్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కోర్టు ట్రావెల్ బ్యాన్ ను నిలిపివేస్తూ గతంలో ఆదేశాలు జారీ చేసింది.

దీనిపై ట్రంప్ వర్గం అప్పీల్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ట్రావెల్ బ్యాన్ సరైనదేనని, అమెరికా రక్షణ కోసం తీసుకున్న నిర్ణయమని సమర్థించుకునే ప్రయత్నం చేయగా, హవాయి ప్రభుత్వ వాదనలు కూడా విన్న అప్పీల్స్ న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని సమర్థిస్తూ, తాజాగా దీనిపై ఇంజెక్షన్ ఆర్డర్ ను జారీ చేసింది.

  • Loading...

More Telugu News