: టర్కీ, గ్రీస్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు!


టర్కీ, గ్రీస్ దేశాల్లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. టర్కీలోని పశ్చిమ ప్రాంతంతో పాటు గ్రీస్‌ లోని లెస్బాస్, చియోస్ ద్వీపాల్లో ఈ భూకంపం వచ్చింది. ఒక్కసారిగా కాళ్లకింద భూమి కదిలిపోవడంతో ప్రాణాలరచేతిలో పెట్టుకుని ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత కాస్త పెద్దగా ఉండడంతో పెద్దసంఖ్యలో ఇళ్లు పునాదులతో సహా కదిలిపోయి, కూలిపోయాయి. దీంతో పలువురు గాయపడగా, శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారని సమాచారం. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. ఈ భూకంపంలో సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News