: విచారణలో అడిగే ప్రశ్నలను తనకు ముందుగానే చెప్పాలని శశికళ పిటిషన్.. కొట్టివేసిన కోర్టు
తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కోసం ఆశపడి భంగపాటుకు గురైన శశికళ నటరాజన్ ప్రస్తుతం ఆక్రమాస్తుల కేసులో జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. విదేశీ మారక ద్రవ్య కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయనున్న విచారణలో తనను అడగనున్న ప్రశ్నలను ముందే తనకు చెప్పాలని ఇటీవల ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. అయితే, ఆమె పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. ఈ విచారణ అంశం అధికారులకు, నిందితులకు మధ్య మాత్రమే ఉండాలని ఈడీ తన పిటిషన్ లో న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కోర్టు తాజా నిర్ణయం తీసుకుంది. శశికళ కోర్టుకు వచ్చి విచారణను ఎదుర్కోవాల్సి ఉండగా, ఆమె ప్రస్తుతం జైలులో ఉంటున్న కారణంగా అది కుదరక వీడియో కాన్ఫ్‌రెన్స్ ద్వారా అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు.