: మహిళపై దుండగుల యాసిడ్ దాడి... చికిత్స పొందుతూ మృతి!
సిద్ధిపేటలోని పాములపర్తి పరిధిలో ఈ రోజు దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోసి, పరారయ్యారు. ఆ దాడిలో ఆ మహిళకు తీవ్రగాయాలు కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. అయితే, బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దుండగులు ఏ కారణం వల్ల ఆ మహిళపై ఈ దారుణానికి పాల్పడ్డారో తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.