: ఛాంపియన్స్ ట్రోఫీ: మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్


ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఈ రోజు జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక తమ ముందు ఉంచిన 237 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ మూడు వికెట్లు కోల్పోయింది. పాకిస్థాన్ ఓపెన‌ర్ జామ‌న్ (50) హాఫ్ సెంచ‌రీ చేసి అవుట్ అయ్యాడు. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన బాబ‌ర్ 10, హ‌ఫీజ్ 1 ప‌రుగుల‌కే వెనుదిరిగారు. మ‌రో ఓపెన‌ర్ అజ‌ర్ 31 ప‌రుగుల‌తో, మాలిక్ 5 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం పాకిస్థాన్ మూడు వికెట్ల న‌ష్టానికి 18 ఓవ‌ర్ల‌లో 106 ప‌రుగుల‌తో క్రీజులో ఉంది. శ్రీ‌లంక బౌల‌ర్ల‌లో ప్ర‌దీప్ 2 వికెట్లు తీయ‌గా, తిషారా 1 వికెట్ తీశాడు.          

  • Loading...

More Telugu News