: సెమీ ఫైనల్ లో టీమిండియాపై విజయం మాదే: బంగ్లాదేశ్ కెప్టెన్ ధీమా
ఛాంపియన్స్ ట్రోఫీలో అంచనాలు లేకుండా బరిలోకి దిగి సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన బంగ్లాదేశ్.. ఈ నెల 15న టీమిండియాతో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఆ జట్టు కెప్టెప్ మొర్తజా తమ జట్టే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో తమపై ఎటువంటి ఒత్తిడిలేదని అన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న భారత్ జట్టుపైనే ఒత్తిడంతా ఉందని చెప్పాడు. తాము స్వేచ్ఛగా ఆడి రాణిస్తామని అన్నాడు. అంచనాలను పట్టించుకుంటే ప్రతీది భూతద్దంలో చూడాల్సి వస్తుందని, తమపై అంచనాలు లేవు కాబట్టి ఎటువంటి ఒత్తిడి లేదని పేర్కొన్నాడు.