: మగవారి మనసులో ఏ ఉద్దేశం ఉందో చూపు ద్వారా పసిగట్టేస్తున్న యువతులు.. పరిశోధనలో వెల్లడి
తమతో చనువుగా ఉంటున్న మగవారి మనసులో ఏ ఉద్దేశం ఉందో యువతులు తేలికగానే పసిగట్టేస్తారట. మగవారి మాటలను, కంటి చూపును పరిశీలించడం ద్వారా వారు చెబుతోన్న కబుర్లు తమని మోసం చేయడానికా? లేదా నిజంగానే చెబుతున్నారా? అని యువతులు ఓ నిర్ధారణకి వస్తున్నట్లు కేమ్బ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. తమ చుట్టూ ఉన్న సమాజాన్ని అతి నిశితంగా పరిశీలించడంతో పాటు రోజువారీ సంఘటనల ఆధారంగా ఆడవారిలో ఈ అంచనా శక్తి పెరుగుతోందని పరిశోధకులు తెలిపారు.
మగవారి చూపు ఆధారంగా వారి ఆలోచనల్ని పసిగట్టవచ్చా? వారి మనసులో దురుద్దేశాన్ని తెలుసుకోవచ్చా? అనే అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా 89 వేల మందిపై పరిశోధకులు ఈ సర్వే నిర్వహించారు. అందులో 50 శాతం మంది మహిళలు ఎదుటివారి చూపుల ద్వారా వారి ఆలోచనల్ని తేలికగా కనిపెట్టేశారని పరిశోధకులు చెప్పారు. అడపిల్లలకి ఆ శక్తి చిన్నప్పటి నుంచే వయసుతో పాటు పెరుగుతోందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు.