: ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్థాన్ విజయ లక్ష్యం 237 పరుగులు
ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు శ్రీలంక-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంకను పాకిస్థాన్ 49.2 ఓవర్లకు ఆలౌట్ చేసింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో గుణతిలక 13, మెండిస్ 27, దినేష్ 0, నిరోషన్ డిక్‌వెల్లా 73, మాథ్యూస్ 39, ధనన్జ్ 1, తిషారా 1, అసెలా 27, తిషారా 1, లక్ష్మల్ 26, మలింగ 9 (నాటౌట్), ప్రదీప్ 1 పరుగులు చేశారు. శ్రీలంకకి ఎక్స్‌ట్రాల రూపంలో 19 పరుగులు వచ్చాయి. దీంతో శ్రీలంక.. పాకిస్థాన్ ముందు 237 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పాక్ బౌలర్లలో జునైడ్, హాసన్ మూడేసి వికెట్లు తీయగా, అమిర్, ఫహీన్ రెండేసి వికెట్లు తీశారు.