: వైసీపీలోకి వెళ్లిపోదామా...?: కార్యకర్తలతో చర్చిస్తున్న టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి


తమ అధిష్ఠానంపై అలిగిన టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసే అంశంపై త‌న నివాసంలో త‌న మ‌ద్ద‌తుదారుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. త‌న‌కు టీడీపీలో స‌ముచిత స్థానం ల‌భించ‌లేద‌ని, స్థానిక టీడీపీ నాయ‌కుల‌తో విభేదాల వ‌ల్ల మ‌న‌స్తాపం చెందాన‌ని ఆయ‌న మీడియాతో అన్నారు. త‌న‌ను న‌వ నిర్మాణ దీక్ష‌కు కూడా దూరంగా పెట్టార‌ని చెప్పారు. ఆయ‌న మ‌రికాసేప‌ట్లో ఓ ప్ర‌క‌ట‌న చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. మ‌రోవైపు ఈనెల 14న వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఆయ‌న‌ వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు ఇప్ప‌టికే సిద్ధమయ్యారని, అందుకు సంబంధించే ప్ర‌స్తుతం త‌న మ‌ద్దతుదారుల‌తో చ‌ర్చిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 

  • Loading...

More Telugu News