: ఏడవ వికెట్ కోల్పోయిన శ్రీలంక!
ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు శ్రీలంక-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోన్న శ్రీలంక ఏడు వికెట్లు కోల్పోయింది. శ్రీలంక ఓపెనర్ గుణతిలక(13), మెండిస్ (27), దినేష్ (0) అవుటయిన సంగతి తెలిసిందే. ధాటిగా ఆడిన ఓపెనర్ నిరోషన్ డిక్‌వెల్లా 73 పరుగులకి ఔటయ్యాడు. మాథ్యూస్ 39, ధనన్జ్ 1, తిషారా 1 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యారు. ప్రస్తుతం క్రీజులో అసెలా 4, లక్ష్మల్ 1 పరుగులతో ఉన్నారు. పాక్ బౌలర్లలో జునైడ్ మూడు వికెట్లు తీయగా, అమిర్ రెండు వికెట్లు తీశాడు. ఫహీమ్, హసన్ లకు చెరో వికెట్ దక్కాయి. శ్రీలంక స్కోరు 179/7 (37 ఓవర్లకి) గా ఉంది.