: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు మూడు రోజుల వరకు ఉత్తర తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల్లోను, ఏపీలోని కొన్ని ప్రాంతాలలోను తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలకు ఈ రోజు విస్తరించిన నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి పూర్తిగా ప్రవేశించాయని, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని చెప్పారు. వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని వివరించింది.