: తెలంగాణలో గ్రూప్-2 నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే
తెలంగాణలో గ్రూప్-2 నియామక ప్రక్రియపై గత కొంతకాలంగా వివాదం చెలరేగుతున్న విషయం విదితమే. తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల నేపథ్యంలో వైటనర్‌తో దిద్దిన జవాబు పత్రాలను పరిగణనలోకి తీసుకున్నారంటూ అభ్యర్థుల నుంచి దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు... నియామక ప్రక్రియపై మూడు వారాల పాటు స్టే ఇచ్చింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్‌సీకి ఆదేశాలు జారీచేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కారుని ఆదేశించింది.