: బీహార్ తో పాటు యూపీకి కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిద్దాం... ఎవరు గెలుస్తారో చూద్దాం: బీజేపీకి నితీశ్ కుమార్ సవాల్


బీహార్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే తాము అక్క‌డ కూడా అధికారంలోకి వ‌స్తామంటూ ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్య‌మంత్రి కేశవ్‌ప్రసాద్ నిన్న సవాల్ విసిరారు.  నితీశ్‌కు అధికార వాంఛ ఎక్కువని, అధికారం లేకుండా ఉండలేరని అన్నారు. దీనిపై స్పందించిన బీహార్ సీఎం నితీశ్‌కుమార్ రేపే ఎన్నిక‌ల‌కు వెళ‌దామ‌ని, బీహార్‌తో పాటు యూపీలోనూ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఎవ‌రు గెలుస్తారో చూద్దామ‌ని ప్ర‌తి స‌వాల్ విసిరారు. కేంద్ర స‌ర్కారు రైతులకు ఇచ్చిన హామీలను ఇప్ప‌టికీ నెరవేర్చడం లేదని నితీశ్ కుమార్ మండిప‌డ్డారు. రైతుల‌కు క‌నీసం గిట్టుబాటు ధర కూడా లభించడం లేదని విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News