: చనిపోయాడనుకున్నారు.. అంత్యక్రియలు నిర్వహించారు.. 16 రోజులకు తిరిగివచ్చాడు!


చనిపోయాడనుకున్న వ్యక్తి పదహారు రోజుల తరువాత తిరిగి వచ్చి షాకిచ్చాడు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పొక్కందల గ్రామానికి చెందిన మురళి ఇంట్లోవారితో గొడ‌వ‌ప‌డి ఎక్క‌డికోవెళ్లిపోయాడు. అత‌డు లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. నెలరోజులుగా ఆయ‌న ఇంటికి రాక‌పోవ‌డంతో ఇంట్లో వారు ఆందోళ‌న చెందుతున్నారు. అదే స‌మ‌యంలో గ‌త‌ నెల 25న సైదాపురం అటవీ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఆ మృత‌దేహాన్ని చూసిన‌ మురళి కుటుంబ సభ్యులు.. మురళి శరీరంపై ఉన్న గుర్తులు.. మృతదేహంపై ఉన్న గుర్తులతో సరిపోవడంతో ఆయ‌నదే అని నిర్ధారించారు. దీంతో గత నెల 26న ఆయ‌న‌కు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, తాజాగా ముర‌ళీ త‌మ ఇంటికి ఎంచ‌క్కా న‌డుచుకుంటూ వ‌చ్చాడు. అత‌డిని చూసిన కుటుంబ స‌భ్యులు ఒక్క‌సారిగా షాక్ తిన్నారు... తేరుకొని త‌మ ముర‌ళీ మ‌ళ్లీ తిరిగి రావ‌డంతో హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ పండుగ చేసుకున్నారు.

  • Loading...

More Telugu News