: మా కాలేజీ రోజుల్లో ఎలా ఉండేవారో ఇప్పుడూ అలాంటి ఎనర్జీతోనే ఉన్నారు!: లాలూపై నితీశ్‌కుమార్‌ ప్రశంసలు


ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్ కి 70 ఏళ్లంటే తాను నమ్మలేకపోతున్నానని బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ అన్నారు. నిన్న లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ పుట్టినరోజు సంద‌ర్భంగా గంగా నదిపై నిర్మించిన రెండు రహదారి వంతెనలను సీఎం నితీశ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాలూ 70 ఏళ్ల వ్యక్తిలా కనిపించడం లేదని అన్నారు. తాము కాలేజీల్లో చదువుకుంటున్నప్పుడు లాలూ ఎలా ఉండేవారో అలాంటి ఎనర్జీతోనే ఇప్పుడూ ఉన్నార‌ని చెప్పారు. గంగా నదిపై రెండు రహదారి వంతెనలు నిర్మించాలని లాలూనే సూచించార‌ని అన్నారు.        

  • Loading...

More Telugu News