: మహేశ్ బాబు కోర్టుకు రావాల్సిందే: 'శ్రీమంతుడు' కేసులో నాంపల్లి కోర్టు


ప్రిన్స్ మహేశ్ బాబుకు నాంపల్లి కోర్టు ఝలక్ ఇచ్చింది. 'శ్రీమంతుడు' చిత్రంపై నెలకొన్న వివాదంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలని మహేశ్ బాబు పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. ఈ సినిమాను తన నవల నుంచి కాపీ కొట్టి తీశారని శరత్ చంద్ర అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నాంపల్లి కోర్టులో విచారణ జరుగగా, నిర్మాత నవీన్ కు మరోసారి సమన్లు జారీ చేస్తూ, చిత్ర హీరోగా ఉన్న మహేశ్ బాబు కూడా కోర్టు విచారణకు రావాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News