: పిలవని పేరంటానికి వెళ్లిన ట్రంప్... పెళ్లి కూతురి హర్షం...వీడియో చూడండి!


వివాహ వేడుకలో ప్రత్యక్షమైన డొనాల్డ్ ట్రంప్ ను చూసి వధూవరులు ఆశ్చర్యపోయిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వీకెండ్ గోల్ఫ్ క్లబ్ కు వెళ్లేందుకు ట్రంప్ షెడ్యుల్ ఫిక్స్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టే ఏర్పాట్లు జరిగాయి. ఇదిలా ఉంచితే, ఆ గోల్ఫ్ క్లబ్ సమీపంలోనే ఎవరిదో వెడ్డింగ్ జరుగుతోంది. ఈ విషయం గుర్తించిన ట్రంప్ నేరుగా వెళ్లి ఆ వివాహ రిసెప్షన్ లో సందడి చేశారు. అనుకోని అతిథి రావడంతో వివాహ వేడుకలో అంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వధువు పరుగెత్తుకుంటూ వచ్చి ట్రంప్ ను కౌగిలించుకోగా, ట్రంప్ ఆప్యాయంగా ఆమెను ముద్దాడారు. తరువాత వధువుతో ట్రంప్ ఫోటోలకు పోజులిచ్చి...మేక్ ఆమెరికా గ్రేట్ అగైన్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. గత ఫిబ్రవరిలో కూడా ట్రంప్ ఇలాగే పిలవని పేరంటానికి వెళ్లి ఆకట్టుకున్నారు. ఆ వీడియో మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News