: నైట్‌క్లబ్ ముందు అమ్మాయిలపై యువకుల వేధింపులు.. గట్టిగా బుద్ధి చెప్పిన యువతులు
ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో పలువురు యువతులు పోకిరీలకు గట్టిగా బుద్ధి చెప్పారు. ఎంజీ రోడ్ ప్రాంతంలో రాత్రి ఒంటిగంటకు నైట్‌క్లబ్స్‌లో తమ పని అయిపోయిన తరువాత ఇళ్లకు బయలుదేరిన కొంత మంది అమ్మాయిలను నలుగురు యువకులు వేధించాలని చూశారు. వారు అసభ్య పదజాలంతో మాట్లాడడంతో ఆ యువతులు హెచ్చరించారు. అయితే, అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆ యువకులు మరో పది మంది స్నేహితులను వెంటేసుకొచ్చి రౌడీయిజం చేశారు. ఒక అమ్మాయిని బలవంతంగా లాక్కెళుతుండగా, మిగతా యువతులంతా కలిసి చెప్పులతో ఆ యువకులపై దాడి చేశారు. దీంతో ఆ యువకులంతా బెదిరిపోయి పారిపోయారు.
ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్నవారంతా ఈ సీన్‌ను సినిమా చూసినట్లు చూశారే తప్పా ఎవ్వరూ ఆ యువకులను ప్రశ్నించలేదు. అంతేగాక, తమ సెల్‌ఫోన్‌లతో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. చివరికి యువతులే తమను తాము కాపాడుకున్నారు. గురుగ్రామ్‌లోని ఎంజే రోడ్డులో సుమారు 15 నైట్‌క్లబ్స్ ఉంటాయి. అక్కడ ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు.