: పదివేల మంది ప్రతినిధులతో 27నుంచి మహానాడు
ఈ నెల 27, 28 తేదీలలో హైదరాబాద్ లో పది వేల మంది ప్రతినిధులతో తెలుగుదేశం మహానాడు నిర్వహించనున్నట్లు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మీడియాకు తెలిపారు. పార్టీల నుంచి నేతల వలసలు సాధారణమైన విషయమేనని, వచ్చేవారు వస్తుంటారని, పోయేవారు పోతుంటారని అన్నారు. వైస్ జగన్ అవినీతిని తప్పుబట్టి మళ్లీ జగన్ ను జైలుకెళ్లి కలవాలనుకోవడం ఏ నీతి? అని దాడి వీరభద్రరావును ఉద్దేశించి అన్నారు.