: మరో అట్రాక్టివ్ ఆఫర్... రూ. 786కు అపరిమిత కాల్స్, 25 జీబీ డేటా
రిలయన్స్ జియోకు తమ కస్టమర్లు తరలివెళ్లకుండా ఎన్నో ఆకర్షణీయమైన ఆఫర్లను టెలికం సంస్థలు ప్రకటిస్తున్న వేళ, వోడాఫోన్ డేటా చార్జీలను 50 శాతానికి పైగా తగ్గిస్తూ, కొత్త ఆఫర్ ను ప్రకటించింది. కేవలం రూ. 786కు 25 గిగాబైట్ల డేటాతో పాటు అపరిమిత కాల్స్ ను అందిస్తామని తెలిపింది. రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా ఈ టారిఫ్ ప్లాన్ ను రూపొందించామని తెలిపింది. రంజాన్ ప్రత్యేక ప్యాక్ లలో భాగంగా 2జీ కస్టమర్లు రోజుకు రూ. 5తో అన్ లిమిటెడ్ డేటాను, 3జీ కస్టమర్లు రోజుకు రూ. 19తో అన్ లిమిటెడ్ డేటాను అందుకోవచ్చని ప్రకటించింది.