: దేవుడా! ఆకాశానికి చిల్లు పడిందా?: బెంబేలెత్తిపోయిన డల్లాస్ వాసులు


ఆకాశానికి చిల్లుపడిందా? అన్న రీతిలో వర్షం ధారగా కురిసింది. అమెరికాలోని టెక్సాస్ లో డౌన్‌టౌన్ డల్లాస్‌ ప్రాంతంలో గతరాత్రి కురిసిన వర్షాలను చూసి స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఆకాశానికి చిల్లు పడిందా? అన్న రీతిలో వర్షం ధారలుగా కురిసింది. భారీ వర్షంతోపాటు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచాయని స్థానికులు తెలిపారు. ఈ గాలివాన ధాటికి టోర్నడోల కంటే ఎక్కువ నష్టం జరిగిందని స్థానికులు వాపోతున్నారు. ఈ వర్షాన్ని దూరంగా రోడ్డుపై వెళ్తూ, ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, దానిని నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News