: వైరల్ అవుతున్న మందిరాబేడి శ్రీలంక టూర్ ఫోటోలు!


సినీ నటి మందిరాబేడి క్రికెట్ యాంకర్ గా మారి తిరుగులేని పాప్యులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. క్రికెట్ యాంకరింగ్ కు గ్లామర్ అద్దిన మందిరా బేడి తన భర్త రాజ్ కౌశల్, కుమారుడితో కలిసి ఈ మధ్యే శ్రీలంక టూర్ కు  వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, స్విమ్మింగ్ పూల్, బీచ్ లలో సేదదీరుతూ విశ్రాంతి తీసుకుంది. ఈ సందర్భంగా ఆమె దిగిన ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసింది.

ఈ ఫోటోలు ఆమె స్టైల్ లో హద్దులు మీరినట్టు ఉండడంతో వైరల్ అవుతున్నాయి. గత కొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న మందిరా బేడి ఇలా అకస్మాత్తుగా బికినీ ఫోటోలు పెట్టడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మందిరా బేడి 'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే' సినిమాలో షారూక్ ను ప్రేమించే యువతి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 'శాంతి' సీరియల్ ద్వారా పాప్యులర్ అయినప్పటికీ క్రికెట్ యాంకరింగ్ తో అశేషమైన అభిమానులను సంపాదించుకుంది.  

https://www.instagram.com/p/BU_VWXrFtgZ/?taken-by=mandirabedi&hl=en



  • Loading...

More Telugu News