: రైతుల డిమాండ్ కు దిగివచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం...రుణమాఫీ చేస్తామని ప్రకటన
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా రైతు రుణమాఫీ ఎజెండాతో ముందుకెళ్లిన బీజేపీ విజయం సాధించి, అధికారం చేపట్టింది. దీంతో దేశంలోనే అతిపెద్దదైన యూపీకి రుణమాఫీ చేస్తున్నప్పుడు తమకు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తూ వివిధ రాష్ట్రాల్లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. రైతులు రోడ్డెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో రైతులు తమకు కూడా రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన ప్రారంభించారు.
రైతుల ఆందోళనను ప్రభుత్వం తేలిగ్గా తీసుకున్నప్పటికీ ఆందోళన ఉద్యమరూపుదాల్చుతోంది. అంతే కాకుండా రైల్ రోకో చేపడతామని రైతు సంఘాలు హెచ్చరించాయి. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని తెలిపింది. అందుకు ఓ కమిటీని నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నివేదిక రుణమాఫీ విధివిధానాలు రూపొందిస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.