: అధ్యక్ష స్థానంలో కూర్చుని 'సినారే' చివరి పలుకులు ఇవే!


ప్రముఖ సాహితీ వేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి ఈ ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై తెలంగాణ భాషా సంఘం అధ్యక్షుడు నందిని సిద్దారెడ్డి స్పందిస్తూ, ఆయన అధ్యక్షుడిగా పాల్గొన్న చివరి సభలో పలికిన పలుకులను గుర్తు చేసుకున్నారు. గత బుధవారం 7వ తేదీన తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించామని, ఆ సభకు అధ్యక్షుడిగా సినారే హాజరై, సరిగ్గా మాట్లాడలేకపోయారని తెలిపారు.

 ఏ సభలోనూ మౌనంగా ఉండని ఆయన, ఆ రోజు మాత్రం తన నోటి నుంచి ఒకే ఒక్క వాక్యం చెప్పారని, 'నా అధ్యక్ష స్థానాన్ని రమణాచారి నిర్వహిస్తారు' అన్న ఆయన మాటలు ఇప్పుడు తన మదిలో పదే పదే తిరుగుతున్నాయని అన్నారు. శేషాద్రి రమణ కవుల గురించి ప్రచురించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించాల్సి ఉండగా, లేచి నిలబడే సత్తువ లేక తనతో ఆవిష్కరింపజేశారని అన్నారు.

  • Loading...

More Telugu News