: తిరుమల వెంకన్న కూడా జీఎస్టీ పరిధిలోనే... మినహాయింపు ప్రసక్తే లేదన్న జైట్లీ!
వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి అమలులోకి రానున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధి నుంచి తిరుమల దివ్యక్షేత్రాన్ని మినహాయించే ప్రసక్తే లేదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. టీటీడీకి మినహాయింపు కుదిరే పని కాదని, టీటీడీని మినహాయిస్తే, దేశంలోని మిగతా సంస్థలన్నీ ఇదే కోరిక కోరతాయని అన్నారు. కాగా, వస్తు సేవల పన్ను నుంచి ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలను మినహాయించాలని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నిన్న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జైట్లీకి వినతిపత్రాన్ని అందించారు. యనమల ఇచ్చిన విజ్ఞాపనపై చర్చించేందుకు తమకు సమయం లభించలేదని, తదుపరి సమావేశంలో ఈ విషయం చర్చిస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను నుంచి మినహాయింపు ఇచ్చిన దృష్ట్యా, జీఎస్టీ నుంచి కూడా తప్పించాలని తాను కోరానని యనమల వ్యాఖ్యానించారు.