: చెట్టును ఢీ కొన్న బస్సు...ఎనిమిది మందికి గాయాలు
తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు చెట్టును ఢీ కొట్టడంతో ఆరుగురు గాయపడిన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాదు నుంచి కొత్తగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు నకిరేకల్ వద్ద అదుపు తప్పి, చెట్టును ఢీ కొట్టింది. దీంతో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటీన నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల్లో డ్రైవర్, కండక్టర్ కూడా ఉండడం విశేషం. యాక్సిడెంట్ కు గురైన సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.