: భారీ వర్షాలకు విరిగిన కొండ చరియలు.. ముగ్గురు చిన్నారుల మృతి


కర్ణాటకలోని కుమ్టా తాలూకా టండ్రకులి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా మరో 8 మంది గాయపడ్డారు. చనిపోయిన చిన్నారులను ధనుష్ మంజునాథ్ అంబిగ (1), యతిన్ నారాయణ అంబిగ (7), భవ్య నారాయణ అంబిగ (10)గా గుర్తించారు. కొండపై నుంచి అకస్మాత్తుగా మట్టిపెళ్లలు విరిగిపడడంతోపాటు పెద్దమొత్తంలో బురద రోడ్డుపై పడి ఆ  పక్కనే ఉన్న ఇళ్లపైకి దూసుకురావడంతో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. కొండ చరియలు విరిగిపడడంతో నాలుగు ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్టు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆరు కిలోమీటర్ల మేర నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News