: ‘మహా’ రైతులకు శుభవార్త చెప్పిన సర్కారు.. రైతుల రుణాలు మాఫీ!


మహారాష్ట్ర రైతులకు ఫడ్నవిస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంట రుణాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌కు తలొగ్గింది. రుణాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఐదెకరాల వరకు కలిగి ఉన్న రైతులకు తక్షణం ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు రైతులు సోమవారం నుంచే కొత్త రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.  ఫడ్నవిస్ సర్కారు నిర్ణయంతో రాష్ట్రంలోని 70 శాతం మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. అయితే ప్రభుత్వంపైన మాత్రం రూ.40 వేల కోట్ల భారం పడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News