: పళని వర్గంతో విలీన చర్చలు లేనట్టే.. చర్చల కోసం ఏర్పాటు చేసిన ప్యానల్‌ను రద్దు చేసిన ఓపీఎస్!


అన్నాడీఎంకే రెబల్ లీడర్, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్  సెల్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. పళని వర్గంతో విలీన చర్చల కోసం ఏర్పాటు చేసిన ప్యానల్‌ను రద్దు చేస్తున్నట్టు పన్నీర్ సెల్వం ఆదివారం ప్రకటించారు. దీంతో ఇక విలీనం ఊసు లేదని తేలిపోయింది. పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో సీనియర్ లీడర్ల ఒత్తిడి మేరకు ఆయనీ ప్రకటన చేశారు. ఓపీఎస్ ప్రకటనతో కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమైంది.

కాగా, కొన్ని డిమాండ్లతో పార్టీని అన్నాడీఎంకే (శశికళ)లో విలీనం చేసేందుకు ఓపీఎస్ ముందుకొచ్చారు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులను పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించడంతో పాటు మరికొన్ని డిమాండ్లను పళని ముందుంచారు. అయితే ఇరు వర్గాల మధ్య చర్చలు అసంపూర్తిగా మిగిలాయి. శశికళ వర్గాన్ని పార్టీ నుంచి బహిష్కరించేందుకు పళని వర్గం అంగీకరించలేదు. విలీనం మాట అటకెక్కింది. దీంతో తాజాగా ఓపీఎస్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News