: ధోనీ సలహాలు వెలకట్టలేనివి... బౌలర్లు అద్భుతంగా రాణించారు: కోహ్లీ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సలహాలు వెలకట్టలేనివని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, ధోనీ సూచనలు ఏ సమయంలో అయినా ఉపయోగపడతాయని చెప్పాడు. అతని సలహాలు వెలకట్టలేనివని చెప్పాడు.
అలాగే తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని చెప్పాడు. బౌలర్లు సఫారీ బ్యాట్స్ మన్ పై ఒత్తిడి పెంచడంతోనే తాము విజయం సాధించామని చెప్పాడు. కట్టుదిట్టమైన బంతులతో సౌతాఫ్రికా ఆటగాళ్లను తక్కువ స్కోరుకే కట్టడి చేశారని అన్నాడు. అనంతరం బ్యాట్స్ మన్ సమర్థవంతంగా ఆడారని, ధావన్ ధాటిగా ఇన్నింగ్స్ ఆడాడని తెలిపాడు. సెమీ ఫైనల్ కు ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పాడు.