: అల్లు అర్జున్ 'డీజే' ఆడియో వేడుక ప్రారంభం
హైదరాబాదు, మాదాపూర్ లోని శిల్పకళావేదికలో దువ్వాడ జగన్నాథం (డీజే) ఆడియో వేడుక ప్రారంభమైంది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు జతగా పూజా హెగ్డే నటించగా, ఈ సినిమాకు సంగీతం దేవీశ్రీ ప్రసాద్ అందించాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిధిగా హాజరుకానున్నారు. ఆడియో వేడుకకు మెగా అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు.