: నయీం డెన్ లో తనిఖీలు .. భారీగా తుపాకులు, బుల్లెట్లు లభ్యం!
పోలీస్ ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం డెన్ లో పోలీసులు తొలిసారిగా తనిఖీలు నిర్వహించారు. ఎన్ కౌంటర్ సందర్భంగా ఆయన నివాసం నుంచి భారీ ఎత్తున డైమండ్స్, బంగారం నగలు, నగదు, ఆస్తుల పత్రాలు లభ్యమైన సంగతి తెలిసిందే. అనంతరం నయీం అక్రమాలు, అన్యాయాలపై సిట్ దర్యాప్తు నిర్వహించింది. ఈ నేపథ్యంలో పలువురు అధికారులు ఆయన డెన్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన డెన్ లో భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట్లు లభ్యమయ్యాయని తెలుస్తోంది. కాగా, ఈ డెన్ లోపలికి అత్యంత సన్నిహితులకు కూడా ఎంట్రీ వుండేది కాదని, నయీం ఒక్కడే ఇక్కడికి వచ్చేవాడని సమాచారం. డెన్ చుట్టూ సీసీ కెమెరాలు అమర్చినట్టు తెలుస్తోంది.