: 7 వికెట్లు కోల్పోయి పటిష్ఠ స్థితి నుంచి బలహీన స్థితిలో పడిన సఫారీలు!


ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఓవల్ లో జరుగుతున్న వన్డేలో టీమిండియా బౌలర్లు పుంజుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు ఆమ్లా (35), డికాక్ (53) శుభారంభం ఇచ్చారు. అనంతరం డివిలీర్స్ (16) నిలదొక్కుకోలేకపోయాడు. అనంతరం వచ్చిన డేవిడ్ మిల్లర్ (1) కూడా విఫలమయ్యాడు. ఆ తరువాత డుప్లెసిస్ (36) ను హార్డిక్ పాండ్య అద్భుతమైన బంతితో బోల్తాకొట్టించాడు. మోరిస్ (4), ఆండిల్ (4) ను బుమ్రా పెవిలియన్ కు పంపాడు. జేపీ డుమిని (18)కి రబాడ (4) జతకలిశాడు.

దీంతో సౌతాఫ్రికా భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తుందని భావించిన వారికి నిరాశ కలిగిస్తోంది. కనీసం 250 పరుగులన్నా చేస్తుందా? అన్న బలహీన స్థితికి జట్టు చేరుకుంది. ఇంకా 9 ఓవర్లు మిగిలి ఉండగా చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి. టీమిండియా బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు, అశ్విన్, జడేజా, పాండ్య చెరొక వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News