: అలాంటి షాట్లకు నువ్వు అబ్బలాంటోడివి: విరాట్ ట్వీట్ కు ప్రముఖ స్నూకర్ ప్లేయర్ రిప్లయ్
శనివారం నాడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన చాంపియన్స్ ట్రోఫీ పోరులో ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక స్టోక్స్ ను మెచ్చుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, "కుమిన్స్ వేసిన ఓ బాల్ ను స్టోక్స్ నిర్దయగా బాదేశాడు. ఇటీవలి కాలంలో అంత ఉత్తమ షాట్ ను నేను చూడలేదు" అని ట్వీట్ చేశాడు. కోహ్లీ అభిప్రాయాన్ని పలువురు అంగీకరిస్తున్న వేళ, బ్రిటన్ లో ప్రముఖ స్నూకర్ ప్లేయర్ మాథ్యూ సెల్ట్ స్పందించాడు.
"అదే షాట్ నువ్వు అయితే, కళ్లు మూసుకుని మరీ కొట్టేసేవాడివి విరాట్. అలాంటి షాట్లు కొట్టేవాళ్లకు నువ్వు అబ్బలాంటోడివి" అని అన్నాడు. ఇక కోహ్లీ ట్వీట్లను మాథ్యూ సెల్ట్ చూస్తున్నాడన్న విషయం భారత్ లోని సెల్ట్ అభిమానులకు తెలిసిపోయింది. సెల్ట్ క్రికెట్ ఫ్యాన్ అని తమకు ఇంతవరకూ తెలియదని పలువురు వ్యాఖ్యానించగా, తాను క్రికెట్ ను ప్రేమిస్తానని, ఎంతో ఇష్టంగా చూస్తానని సమాధానం ఇచ్చాడు సెల్ట్.