: 'బాహుబలి 2'లో కుంతల రాజ్యాన్ని కాపాడిన ఆ ఎద్దులు... ఇప్పుడు అరక దున్నుతున్నాయి!
'బాహుబలి: ది కన్ క్లూజన్' చిత్రంలో ఎద్దుల సాయాన్ని తీసుకుని కుంతల రాజ్యాన్ని కాపాడే సన్నివేశం గుర్తుందా? ఆ సీన్ లో రాజమౌళి టీమ్ వాడుకున్న ఎద్దులు ఇప్పుడు విజయవాడ శివారు ప్రాంతంలోని ఈడ్పుగల్లులో అరకదున్నుతున్నాయి. బాహుబలి నిర్మాత యార్లగడ్డ శోభు ఆ ఎద్దులను ఈడ్పుగల్లుకు చెందిన ప్రముఖ రైతు నేత వీరమాచనేని శ్రీనివాసరావుకు అప్పగించారు. ఆయనే స్వయంగా వాటిని సంరక్షిస్తూ, తన వ్యవసాయ పనులకు వినియోగిస్తున్నారు. మెలితిరిగిన కొమ్ములతో బలిష్టంగా కనిపిస్తున్న వాటిని చూసేందుకు ఇప్పుడు స్థానికులు ఆసక్తిని చూపుతున్నారు.