: దావూద్ ఇబ్రహీం మాదిరి నేర సామ్రాజ్యాన్ని ఏలాలనుకున్న పాల వ్యాపారి కొడుకు!


గ్యాంగ్ స్టర్ చోటా షకీల్ అనుచరుడిగా మారి, పాక్ లో పుట్టి, కెనడాలో రచయితగా స్థిరపడ్డ తారీక్ ఫతాహ్ ను హత్య చేసేందుకు పథకం రూపొందించి పోలీసులకు పట్టుబడ్డ 21 సంవత్సరాల జునైద్ చౌదరి పోలీసుల విచారణలో కీలక సమాచారాన్ని వెల్లడించాడు. బుధవారం నాడు ఢిల్లీలోని వజీరాబాద్ లో ఇతన్ని అరెస్ట్ చేయగా, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మాదిరిగా నేర సామ్రాజ్యాన్ని ఏలాలన్నది తన లక్ష్యమని జునైద్ చెప్పినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
 
ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించే తారీక్ ను హతమార్చాలని ప్లాన్ వేశాడని స్పెషల్ సెల్ విభాగం డీసీపీ పీఎస్ కుశ్వాహ్ వెల్లడించారు. గోపాల్ పురి ప్రాంతంలోని ఓ పాలవ్యాపారి కుమారుడైన జునైద్ కు, ఆయుధాల కొనుగోలు కోసం రూ. 1.5 లక్షలను గుర్తు తెలియని వ్యక్తి  ఇచ్చాడని, దీంతో ఓ పిస్టల్, నాలుగు కార్ట్రిడ్జ్ లను కొన్నాడని, వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తారీక్ ను చంపితే కనుక తనను తీహార్ జైలుకి పంపుతారని, ప్రస్తుతం అక్కడే వున్న దావూద్ ఇబ్రహీం శత్రువైన చోటా రాజన్ ను కూడా హతమార్చవచ్చని జునైద్ అనుకున్నాడని డీసీపీ చెప్పారు.  

  • Loading...

More Telugu News