: 'బాహుబలి' నగలు ధరిస్తారా? రూ. 600 నుంచి లక్షన్నర వరకూ రెడీ!
ప్రపంచ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన 'బాహుబలి' సీరీస్ లో దేవసేన ధరించిన మువ్వల నగల సెట్ కావాలా? ఆమె ధరించిన గాజులు, నక్లెస్ లు, పాపిట బిళ్లలు, వడ్డాణాలపై మనసైందా? శివగామి ధరించిన హారాలు మనసుకు నచ్చాయా? అయితే, వాటన్నింటినీ సొంతం చేసుకోవచ్చు. బాహుబలి చిత్రం కోసం ప్రముఖ జ్యూయలరీ సంస్థ దాదాపు 1500 రకాల నగలను తయారు చేసిన సంగతి తెలిసిందే. వీటన్నింటినీ ఇప్పుడు 'బాహుబలి కలెక్షన్' పేరిట 'www.tribebyamrapali.com' వెబ్ సైట్లో అందుబాటులోకి తెచ్చారు. వీటి ధరలు రూ. 600 నుంచి రూ. 1.5 లక్షల రూపాయల వరకూ ఉంటాయని, కస్టమర్లు తమకు నచ్చిన వివిధ రకాల ఆభరణాలను ఎంచుకోవచ్చని అమ్రపాలి వెల్లడించింది.