: పోయిస్ గార్డెన్ లోకి దూసుకెళ్లిన జయలలిత మేనకోడలు దీప!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్, ఈ ఉదయం పోయిస్ గార్డెన్ లోకి దూసుకెళ్లారు. జయలలిత నివాసమైన వేదనిలయం ఇంటిపై హక్కులు తనవేనని వాదిస్తున్న దీప, తన మద్దతుదారులతో కలసి పోయిస్ గార్డెన్ లోకి వెళ్లగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దీపకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఇంటిపై మరెవరికీ హక్కులు లేవని, ఇది తమకు వారసత్వంగా వచ్చిన భవంతి అని ఈ సందర్భంగా దీప వ్యాఖ్యానించారు. దీపా జయకుమార్ రావడంతో ఈ ప్రాంతంలోని వేదనిలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో వేదనిలయంలోకి మాత్రం ఆమె వెళ్లలేకపోయారు.